Richa Ghosh : వరల్డ్ కప్ ఛాంపియన్ రీచా ఘోష్ (Richa Ghosh)పై ప్రశంసల వర్షంతో పాటు వరాల జల్లు కూడా కురిసింది. భారత జట్టు విజయంలో కీలకమైన రీచాకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సర్‌ప్రైజ్‌ల మీద సర్ప్రైజ్లు ఇచ్చింది. శనివారం జరిగిన సన్మాన కార్యక్రమంలో వికెట్ కీపర్, బ్యాటర్‌ను డీఎస్పీ(DSP)గా నియమించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Benerjee). అదనంగా రూ.34 లక్షల చెక్కు, అత్యున్నత పౌర పురస్కారం బహూకరించిన సీఎం.. రీచా పేరు కలకాలం నిలిచిపోయేలా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
వరల్డ్ కప్ కోసం నలభై దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న మహిళల జట్టు కలను సాకారమవ్వడంలో రీచా ఘోష్ పాత్ర మరువలేనిది. డెత్ ఓవర్లలో విధ్వంసక ఆటతో భాతర విజయాల్లో భాగమైన రీచాకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరో గౌరవం కల్పించనుంది. ‘రీచా 22 ఏళ్లకే వరల్డ్ ఛాంపియన్ అయింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున ఆమెను ఘనంగా సన్మానించాం. డీఎస్పీ ఉద్యోగం.. రూ.34 లక్షల చెక్కు ఇచ్చాం. నాకు ఎందుకో తన కోసం మరింత చేయాలనుంది.
🏟️ *RICHA GHOSH STADIUM COMING SOON!* 🌟
A proud move by West Bengal CM *Mamata Banerjee* to honour Bengal’s cricket star! 🇮🇳🔥 pic.twitter.com/hI7eqZzUx5— CricketGully (@thecricketgully) November 10, 2025
అందుకే.. కొత్తగా నిర్మించబోయే స్టేడియానికి రీచా పేరు పెట్టాలని అనుకుంటున్నాం. డార్జిలింగ్‌లో 27 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. అక్కడ స్టేడియం కట్టాలని మేయర్‌కు చెప్పాను. ఆ స్టేడియం నిర్మాణం పూర్తికాగానే రీచా క్రికెట్ స్టేడియం అని పేరు పెడుతా. దాంతో.. వరల్డ్ కప్ విజేతగా ఆమె పేరు కలకాలం ప్రజల గుండెల్లో నిలుస్తుంది. అంతేకాదు భావి తరాలు ఆమెను చూసి స్ఫూర్తి పొందుతాయి’ అని మమత తెలిపారు.
West Bengal: CM Mamata Banerjee announces a cricket stadium in Siliguri to be named after India’s World Cup winner Richa Ghosh
She says, “We are proud of Richa and have also felicitated her. I want to build a cricket stadium here, which will be named after Richa. People will be… pic.twitter.com/WCqWbgmMEh
— IANS (@ians_india) November 10, 2025
శుక్రవారం జరిగిన సత్కార కార్యక్రమంలోనే రీచాకు డీఎస్పీ హోదాను ఖరారు చేశారు సీఎం మమతా బెనర్జీ. క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, మాజీ పేసర్ ఝులాన్ గోస్వామి, ముఖ్యమంత్రి మమత చేతుల మీదుగా రీచా రూ.34 లక్షల చెక్కును అందుకున్నారు. రాష్ట్రంలో మహిళా క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచినందుకు రీచాకు బెంగాల్ అత్యున్నత పౌర పురస్కారమైన ‘బంగా బిబుసాన్’ అవార్డును ప్రకటించారు. అంతర్జాతీయంగా క్రికెట్ దిగ్గజాల పేర్లతో స్టాండ్స్ ఉండడం చూశాం. మనదేశంలో మహిళల జట్టు మాజీ క్రికెటర్లు మిథాలీ రాజ్(Mithali Raj) పేరుతో విశాఖపట్టణం, ఝులాన్ గోస్వామి (Ghulan Goswami) పేరిట ఈడెన్ గార్డెన్స్‌లో పెవిలియన్ ఉన్నాయి. కానీ, ఒక మహిళా క్రికెటర్ పేరిట స్టేడియం మాత్రం లేదు. అలాంటిది రీచా పేరుతో క్రికెట్ స్టేడియం అంటే ఆమెకు దక్కిన అరుదైన గౌరవం కానుంది.
ప్రపంచకప్‌లో ఫినిషర్‌గా రీచా ఘోష్ అదరగొట్టింది. ఓపెనర్లు ప్రతీకా రావల్, స్మృతి మంధానలు ఇచ్చిన శుభారంభాన్ని చివరకు భారీ స్కోర్‌గా మలచడంలో కీలకమైందీ యంగ్‌స్టర్. ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఈ చిచ్చరపిడుగు 133.52 స్ట్రయిక్ రేటుతో 235 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాపై మిడిలార్డర్ విఫమైన వేళ.. ఆమె చేసిన 94 పరుగుల ఇన్నింగ్స్ మ్యాచ్‌కే హైలెట్. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై జెమీమా రోడ్రిగ్స్(127 నాటౌట్)తో కలిసి విలువైన రన్స్ చేసింది రీచా. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడిన తను16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 రన్స్ చేసింది. ఇక ఫైనల్లోనూ దంచేసిన డేరింగ్ ఉమెన్ 34 రన్స్‌తో టీమిండియా భారీ స్కోర్‌లో భాగమైంది.
Richa Ghosh’s 12 sixes pic.twitter.com/0T3fzeyZwI
— Cric Gold Alt (@Cricsgoldy11) November 6, 2025