న్యూఢిల్లీ : థాయ్‌లాండ్ వేదికగా వచ్చే ఏడాది జరిగే మహిళల ఏఎఫ్సీ అండర్-20 ఏషియన్ ఫైనల్స్ టోర్నీలో గ్రూపులు ఖరారయ్యాయి. సోమవారం బ్యాంకాక్‌లో గ్రూపుల వర్గీకరణ జరిగింది. ఇందులో జపాన్, ఆస్ట్రేలియా, చైనీస్ తైపీతో కలిసి కఠినమైన గ్రూపు-సీలో నిలిచింది. 20 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి ఏషియన్ టోర్నీకి అర్హత సాధించిన యువ భారత్..జపాన్‌తో తమ తొలి పోరులో తలపడనుంది.
ఆ తర్వాత ఆస్ట్రేలియా, చైనీస్ తైపీతో ఆడనుంది. 2024లో రన్నరప్‌గా నిలిచిన జపాన్ టీమ్..రికార్డు స్థాయిలో ఆరుసార్లు టైటిల్ విజేతగా నిలువగా, ఆసీస్, చైనీస్ తైపీ రూపంలో భారత్‌కు కఠినమైన ప్రత్యర్థులు ఎదురుకానున్నారు. గ్రూపులో టాప్-2లో నిలిచిన జట్లు క్వార్టర్స్‌కు అర్హత సాధించనున్నాయి. టోర్నీలో టాప్-4లో ఉండే జట్లు 2026 ఫిఫా అండర్-20 ప్రపంచకప్ టోర్నీకి నేరుగా బెర్తు దక్కించుకుంటాయి.