BCCI : చరిత్రాత్మక వన్డే వరల్డ్ కప్ విక్టరీని ఆస్వాదిస్తున్న భారత మహిళల జట్టుకు మరో కోచ్ రాబోతున్నాడు. అసాధ్యాన్ని సాధ్యం చేసిన కోచ్ అన్మోల్ మజుందార్ (Anmol Mazumdar)కు అండగా మరొకరిని బీసీసీఐ నియమించనుంది. అది కూడా తొలిసారి విదేశీ కోచ్‌ను. సుదీర్ఘ అనుభవం కలిగిన నాథన్ కీలీ(Nathan Kiely)ని ఫిట్నెస్, కండీషనింగ్ కోచ్(Conditioning Coach)గా తీసుకునేందుకు చర్చలు జరుపుతోంది భారత బోర్డు. ఒకవేళ అన్నీ కుదరితే అతడి త్వరలోనే బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో సేవలందించనున్నాడు.
తొలి ఐసీసీ ట్రోఫీని సాధించిన భారత మహిళల జట్టు భవిష్యత్‌లో మరిన్ని టైటిళ్లపై గురి పెట్టింది. అందుకు.. బీసీసీఐ కూడా తగిన ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో అనుభవజ్ఞులను కోచింగ్ సిబ్బందిగా తీసుకుంటోంది. టీమిండియా ఫిట్నెస్ కోచ్‌గా పని చేస్తున్న అల్ హర్షాకు కొత్త బాధ్యతలు అప్పగించనుంది బీసీసీఐ.
India’s women’s cricket team is set to welcome its first foreign strength & conditioning coach, with Bangladesh men’s S&C expert Nathan Kiely likely to join BCCI’s Centre of Excellence.
Read More:https://t.co/OOLnwyGAEZ#IndianCricket #WomensCricket #BCCI #CricketNews
— Rediff Cricket (@rediffcricket) November 10, 2025
కాబట్టి అతడి స్థానంలో నాథన్ కీలిని నిమమించాలని బోర్డు పావులు కదుపుతోంది. బీసీసీఐతో చర్చలు ఫలిస్తే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో క్రికెటర్లకు ఫిట్నెస్ పాఠాలు చెప్పనున్నాడు నాథన్. బంగ్లాదేశ్ పురుషుల జట్టుకు సేవలందించిన నాథన్ ఈమధ్యే కుటుంబ కారణాలతో వైదొలిగాడు. తన హయాంలో ‘యో యో’ టెస్టు, ‘బీప్ టెస్టు’కు ప్రత్యామ్నాయంగా ‘టైమ్ ట్రయల్’ (Time Trial) టెస్టును పరిచయం చేశాడు. ఫిట్నెస్ సమస్యలు, గాయలతో ఇబ్బంది పడుతున్న బంగ్లా క్రికెటర్లకు ఈ టెస్టు సత్ఫలితాలను ఇచ్చింది. అతడికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో న్యూ సౌత్‌వేల్స్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది.