న్యూఢిల్లీ, నవంబర్ 10 : ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. విదా వీఎక్స్2 పేరుతో ఈ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది 3.4 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1.02 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. పాత మాడల్‌తో పోలిస్తే ఈ నయా మాడల్‌లో నూతన ఫీచర్స్, మూడు బ్యాటరీ ఫీచర్స్ 2.2 కిలోవాట్లు, 3.4 కిలోవాట్ల బ్యాటరీ సామర్థ్యంతో తీర్చిదిద్దింది.
3.4 కిలోవాట్ల బ్యాటరీ కలిగివున్న ఈ స్కూటర్ సింగిల్ చార్జింగ్‌తో 100 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ స్కూటర్ బ్యాటరీలు రెండు పూర్తిస్థాయి రీచార్జింగ్ కావాలంటే గరిష్ఠంగా ఏడు గంటలు పట్టనున్నది. 4.3 ఇంచుల డిజిటల్ డిస్ప్లే కలిగిన ఈ స్కూటర్‌ను స్మార్ట్‌ఫోన్‌తో కనెక్టింగ్ చేసుకోవచ్చును. దీంతో నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్, కాల్ అలర్ట్ కూడా కనిపించనున్నది.