న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: రష్యా-ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం..చమురు, గ్యాస్ ధరలకే పరిమితం కాదని రిజర్వ్‌బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ఈ రెండు ఇంధనాలతో గోధుమ తదితర నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతాయన్నారు. ముఖ్యంగా యూరప్ దేశాలు అల్లాడిపోతాయని, రష్యా సహజవాయువుపై ఆ దేశాలు ఆధారపడటం, ఈ ఇంధన సరఫరా పరిమితంగా ఉండటం ఇందుకు ప్రధాన కారణమని రాజన్ వివరించారు. అలాగే ఇప్పటికే ఒత్తిడిలో వున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం కష్టమవుతుందన్నారు. ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయిలో ఉన్నందున, అమెరికా ఫెడ్..మార్చి సమావేశంలో వడ్డీ రేట్ల పెంపును మొదలు పెడుతుందన్నారు.