Harish Rao | రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడికే అపాయింట్మెంట్ లేదు.. ఇదెక్కడి ప్రజాపాలన..? : హరీశ్ రావు
harish rao | రేవంత్ రెడ్డి తమది ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటారు. ప్రజలను ఎప్పుడైనా కలిసేదే ప్రజా ప్రభుత్వం కదా..! మరి 17,200 మంది రేషన్ డీలర్లు ఎన్నుకున్న రాష్ట్ర అధ్యక్షుడికే మూడేళ్లలో అపాయింట్మెంట్ దొరకకపోతే ఇదెక్కడి ప్రజాపాలన..? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు.
Harish Rao | సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌లోని బింగి ఎల్లయ్య గార్డెన్స్‌లో ఈరోజు నిర్వహించిన రాష్ట్రవ్యాప్త రేషన్ డీలర్ల సమావేశానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి తరలివచ్చిన రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి,ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు, ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్, ధరావత్ మోహన్ నాయక్, అజీజ్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజును నేను గత 25 ఏళ్లుగా చూస్తున్నాను. ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి సునీతా లక్ష్మారెడ్డిని, పద్మా దేవేందర్ రెడ్డిని, ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి ని గౌరవ అధ్యక్షులుగా పెట్టుకుని డీలర్ల సమస్యల పరిష్కారం కోసం ఎవరిని ఎలా ఒప్పించాలో తెలిసిన నేర్పరి. అయితే ఈరోజు వేదిక మీద నాయికోటి రాజు మాట్లాడుతూ.. డీలర్ల సమస్యలు పరిష్కారం కాకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా, ప్రాణత్యాగానికైనా సిద్ధం అనడం నన్ను కదిలించింది.
నిన్ననే జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే, డీలర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు అనిరుధ్ రెడ్డి కూడా ఒక మాట అన్నారు.. మంత్రుల నియోజకవర్గాలకే నిధులు పోతున్నాయి, జడ్చర్లలో రోడ్లు పగుళ్లు పడ్డా రూ. 30-40 కోట్ల బిల్లులు రావడం లేదు, ఒక కాంట్రాక్టర్ చనిపోతేనే రూ. 5 కోట్ల బిల్లు పడింది, నేను చచ్చిపోతేనే మా నియోజకవర్గ బిల్లులు వస్తాయంటే ప్రాణత్యాగానికి సిద్ధం అని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే.. చచ్చిపోతేనే పనులు అవుతాయా..? చచ్చిపోతేనే బిల్లులు వస్తాయా? అధికార పార్టీ ఎమ్మెల్యేనే చచ్చిపోవడానికి సిద్ధమనే దుస్థితి వచ్చింది. కానీ ఎవరూ చచ్చిపోవద్దు, అందరూ బాగుండాలి. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప.. అందరం కలిసి గట్టిగా కొట్లాడి బిల్లులు, డీలర్ల కమిషన్ సాధించుకుందామన్నారు.
డీలర్ల వైపు కన్నెత్తి చూసే నాథుడే లేడు..
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తెల్లారే హామీలు అమలు చేయమని డీలర్లు అడగలేదు. కొత్త ప్రభుత్వం కుదురుకోవాలని ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు ఓపికగా ఎదురుచూశారు. కానీ మూడేళ్లు గడిచినా డీలర్ల వైపు కన్నెత్తి చూసే నాథుడే లేడు. కనీసం సివిల్ సప్లైస్ కమిషనర్ గానీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గానీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని అధ్యక్షుడు రాజు బాధపడుతున్నారని హరీశ్ రావు అన్నారు. .
రేవంత్ రెడ్డి తమది ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటారు. ప్రజలను ఎప్పుడైనా కలిసేదే ప్రజా ప్రభుత్వం కదా..! మరి 17,200 మంది రేషన్ డీలర్లు ఎన్నుకున్న రాష్ట్ర అధ్యక్షుడికే మూడేళ్లలో అపాయింట్మెంట్ దొరకకపోతే ఇదెక్కడి ప్రజాపాలన..? నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాయికోటి రాజు, నందయ్య తదితరులు వస్తే సచివాలయంలో రెండు రోజుల పాటు కూర్చోబెట్టి, భోజనం పెట్టి, నాటి మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి అధికారులను, కేసీఆర్ ని ఒప్పించి కమిషన్‌ను రూ. 140కి పెంచాం.
ఆ రోజు బయట ప్రెస్ మీట్ పెట్టిన ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి రూ. 140 ఏం చాలుతాయి, కనీసం రూ. 300 ఇవ్వాలి అని మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఒక్కో డీలర్ వందలాది ఓట్లు వేయిస్తాడని జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు నందయ్య, జీవన్ రెడ్డి వెళ్లి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు కి చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టించారు.
నెలకు రూ. 5,000 గౌరవ వేతనం, క్వింటాలుకు రూ. 300 కమిషన్, రేషన్ షాపులను మినీ సూపర్ మార్కెట్లుగా మార్చి అన్ని వస్తువులు అమ్ముకునే అనుమతి ఇస్తామని నమ్మబలికారు. ఆ మాటలు నమ్మి డీలర్లందరూ కాంగ్రెస్‌కు పనిచేసి, ఓట్లు వేయించి గెలిపించారు. ఇవాళ డీలర్లు కొత్త డిమాండ్లేమీ పెట్టడం లేదు.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఆ మూడు హామీలనే అమలు చేయమని అడుగుతున్నారన్నారు.
Read Also :
Sigma | ఓటీటీలోకి విజయ్ కొడుకు తొలి సినిమా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
India-A Vs New Zealand-A: డ్రాగా ముగిసిన ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మ్యాచ్
Karimnagar | ఎల్నీనో ఎఫెక్ట్.. ఎండుతున్న పంటలు.. కరువు కోరల్లో కరీంనగర్
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడికే అపాయింట్మెంట్ లేదు.. ఇదెక్కడి ప్రజాపాలన..? : హరీశ్ రావు
Ramayana | ‘రామాయణ’ పాటలపై విమర్శలు.. స్పందించిన ఏఆర్ రెహమాన్!
Nutrition | పోషకాహారం అధికంగా తీసుకోవడం లేదా వ్యాయామ తీవ్రత.. గుండె జబ్బులకు ఏది కారణం..?
Free Bus | ఫ్రీ బస్ వల్ల నా భార్య నన్ను వదిలేసి వెళ్లిపోయింది సార్.. ఎమ్మెల్యే కవ్వంపల్లితో కనకయ్య ఆవేదన
NRI | కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

