SL vs HKC : ఆసియా కప్‌లో శ్రీలంక రెండో విక్టరీ కొట్టింది. తొలి పోరులో బంగ్లాదేశ్‌ను ఓడించిన లంక అతికష్టమ్మీద హాంకాంగ్‌పై గెలుపొందింది. బౌలర్ల వైఫల్యంతో ప్రత్యర్థికి భారీ స్కోర్ సమర్పించుకున్న జట్టును ఓపెనర్ పథుమ్ నిశాంక(68) గట్టెక్కించాడు. ఆరంభంలోనే హాకాంగ్ పేసర్ల విజృంభణతో కుశాల్ మెండిస్ (11), కమిల్ మిశ్రా(19)లు పెవిలియన్ చేరారు. అయినా సరే.. కుశాల్ పెరీరా(20) కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. మిడిల్ ఓవర్లలో ధనాధన్ ఆడిన అతడు అర్ధ శతకంతో లంకను గెలుపు బాట పట్టించాడు. ఆఖర్లో హసరంగ (20 నాటౌట్) ధనాధన్ ఆడి జట్టుకు 6 వికెట్ల విజయాన్ని అందించాడు.
చిన్న జట్టు అని హాంకాంగ్‌ను తక్కువ అంచనా వేసిన శ్రీలంక విజయం కోసం చెమటోడ్చాల్సి వచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ 149 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. లంకకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కుశాల్ మెండిస్(11), కాసేపటికే కమిల్ మిశ్రాలు (19)లు పెవిలియన్ చేరారు. రెండు వికెట్లు పడడంతో లంక ఒత్తిడికి లోనైంది. కానీ పథుమ్ నిశాంక(68).. కుశాల్ పెరీరా(20)లు ప్రత్యర్థి బౌలర్లను ఉతికేస్తూ స్కోర్‌బోర్డును నడిపించారు.
A brave fight from Hong Kong, but Sri Lanka hold on in a nervy finish 🇱🇰
SCORECARD ▶️ https://t.co/kZvjC0uiAN#ASIACUP2025 pic.twitter.com/oocweXyvNr
— ESPNcricinfo (@ESPNcricinfo) September 15, 2025
కెప్టెన్ చరిత అసలంక (2), కమిందు మెండిస్ (5)లు విఫలమైనా.. వనిందు హసరంగ(20 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగాడు. అతీక్ ఇక్బాల్ వేసిన 19వ ఓవర్లో హసరంగ వరుసగా రెండు ఫోర్లతో జట్టును గెలిపించాడు. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందిన లంక గ్రూప్ బీ నుంచి సూపర్ 4కు చేరువైంది.
తొలి మ్యాచ్‌లో అఫ్గనిస్థాన్ బౌలర్లుకు తలొగ్గిన హాంకాంగ్ తమ రెండో మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసింది. టాపార్డర్ బ్యాటర్లు దూకుడే మంత్రగా ఆడి.. శ్రీలంక బౌలర్లను ముప్పతిప్పలు పెట్టారు. ఓపెనర్లు ఓపెనర్లు జీషన్ అలీ(23), అన్షుమన్ రథీ(48)లు గట్టి పునాది వేయగా నిజాకత్ ఖాన్(52 నాటౌట్) ఏకంగా అర్ధ శతకంతో చెలరేగాడు. రథీతో కలిసి లంక బౌలింగ్ దళాన్ని కంగారెత్తించిన నిజాకత్ మూడో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో.. హాంకాంగ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల కోల్పోయి 149 పరుగులు చేయగలిగింది.
Two solid knocks lift Hong Kong to 149 for 4 – can they pull off the first upset of Asia Cup 2025? 👀
Follow LIVE ▶️ https://t.co/kZvjC0uiAN pic.twitter.com/D24ujPjALr
— ESPNcricinfo (@ESPNcricinfo) September 15, 2025