Asia Cup : ఆసియా కప్‌లో యూఏఈ (UAE) బోణీ కొట్టింది. తొలి పోరులో భారత జట్టు చేతిలో దారుణంగా ఓడిన ఆతిథ్య టీమ్ సోమవారం ఒమన్(Oman)ను వణికించింది. కెప్టెన్ ముహమ్మద్ వసీం(69), ఓపెనర్ అలీషాన్ షరాఫు(51)ల మెరుపులతో భారీ స్కోర్ చేసిన యూఏఈ ప్రత్యర్థిని 130కే ఆలౌట్ చేసింది. 42 పరుగుల తేడాతో గెలుపొంది పాయింట్ల ఖాతా తెరిచింది. దాంతో.. వరుసగా రెండు విజయాలతో గ్రూప్ ఏ టేబుల్లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా సూపర్ 4కు దూసుకెళ్లింది.
సొంతగడ్డపై జరుగుతున్న ఆసియా కప్‌లో యూఏఈ జట్టు తొలి విజయం సాధించింది. టీమిండియా చేతిలో ఓటమి నుంచి తేరుకున్న బ్య బ్యాటర్లు ఒమన్ బౌలర్లపై విరుచుకుపడి భారీ స్కోర్ అందించారు. కెప్టెన్ ముహమ్మద్ వసీం(69), ఓపెనర్ అలీషాన్ షరాఫు(51)లు బౌండరీల మోతతో హాఫ్ సెంచరీ లు బాదేశారు. ఆఖర్లో హర్షిత్ కౌశిక్(19) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు.
💥 Junaid Siddique Strikes Early! Jatinder Singh Dragged Back and Bowled for 20, UAE on Top! 💥#AsiaCup2025 #UAE #Oman #starzplay pic.twitter.com/FefLPwFH6B
— Cricket on STARZPLAY (@starzplaymasala) September 15, 2025
నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసిన ఆతిథ్య జట్టు అనంతరం ప్రత్యర్థిని 130కే పరిమితం చేసింది. పేసర్ జునైద్ సిద్దిఖీ (4-23) విజృంభించడంతో ఒమన్ బ్యాటింగ్ యూనిట్ కుప్పకూలింది. ఆ జట్టులో ఆర్యన్ బిష్త్ (24), కెప్టెన్ జతిందర్ సింగ్ (20), వినాయక్ శుక్లా(20)లు రాణించారు. కీలక ఇన్నింగ్స్‌తో యూఏఈ విజయంలో కీలకమైన అలీషాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
A win for UAE over Oman in Match 7 confirms India’s spot in the Super Four pic.twitter.com/C61skoGBWW
— ESPNcricinfo (@ESPNcricinfo) September 15, 2025