SL vs HKG : ఆసియా కప్‌ను విజయంతో ఆరంభించిన శ్రీలంక (Srilanka) రెండో మ్యాచ్ ఆడుతోంది. దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ స్టేడియంలో హాంకాంగ్(Hong Kong) జట్టుతో లంక తలపడుతోంది. టాస్ గెలిచిన సారథి చరిత అసలంక బౌలింగ్ ఎంచుకున్నాడు. కీలకమైన ఈ మ్యాచ్‌కు లంక ఒక మార్పు చేసింది.
పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తున్న నేపథ్యంలో పేసర్ పథిరన స్థానంలో థీక్షణను తీసుకుంది లంక. తొలి మ్యాచ్‌లో అఫ్గనిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిన హాంకాంగ్ లంకను నిలువరించాలని భావిస్తోంది. ఒక మార్పుతో బ్యాటింగ్‌కు దిగుతున్న పసికూన పోరాడగలిగే స్కోర్ సాధిస్తుందా? లేదా? అనేది మరికొన్ని నిమిషాల్లో తెలియనుంది.
Double-header day at the Asia Cup 💪
Can Sri Lanka stay unbeaten or will Hong Kong break through?
Follow LIVE ▶️ https://t.co/kZvjC0uiAN pic.twitter.com/lCv2lykItQ
— ESPNcricinfo (@ESPNcricinfo) September 15, 2025
శ్రీలంక తుది జట్టు : పథుమ్ నిశాంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), కమిల్ మిశ్రా, కుశాల్ పెరీరా, చరిత్ అసలంక(కెప్టెన్), కమిందు మెండిస్, దసున్ శనక, వనిందు హసరంగ, థీక్షణ, దుష్మంత చమీర, నువాన్ తుషార.
హాంకాంగ్ తుది జట్టు : జీషన్ అలీ(వికెట్ కీపర్), అన్షుమన్ రథ్, బాబర్ హయత్, నిజకాత్ ఖాన్, షాహిద్ వసీఫ్, కించిత్ షా, యాసీం ముర్తాజా(కెప్టెన్), ఐజజ్ ఖాన్, ఆయుష్ శుక్లా, ఇషాన్ ఖాన్, అతీక్ ఇక్బాల్.