SL vs HKC : ఆసియా కప్‌లో పెద్ద జట్లకు షాకివ్వాలనుకుంటున్న హాంకాంగ్ (Hong Kong) తమ రెండో మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసింది. టాపార్డర్ బ్యాటర్లు దూకుడే మంత్రగా ఆడి.. శ్రీలంక బౌలర్లను ముప్పతిప్పలు పెట్టారు. ఓపెనర్లు ఓపెనర్లు జీషన్ అలీ(23), అన్షుమన్ రథీ(48)లు గట్టి పునాది వేయగా నిజాకత్ ఖాన్(52 నాటౌట్) ఏకంగా అర్ధ శతకంతో చెలరేగాడు. రథీతో కలిసి లంక బౌలింగ్ దళాన్ని కంగారెత్తించిన నిజాకత్ మూడో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో.. హాంకాంగ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల కోల్పోయి 149 పరుగులు చేయగలిగింది.
ఆసియా కప్ తొలి పోరులో అఫ్గనిస్థాన్‌పై విఫలమైన హాంకాంగ్ బ్యాటర్లు సోమవారం శ్రీలంకపై మాత్రం ఓ రేంజ్లో ఆడారు. టాస్ ఓడిన జట్టుకు ఓపెనర్లు జీషన్ అలీ(23), అన్షుమన్ రథీ(48)లు శుభారంభం ఇచ్చారు. పటిష్టమైన లంక బౌలింగ్ దళాన్ని దీటుగా ఎదుర్కొని స్కోర్ బోర్డును నడిపించారు. తొలి వికెట్‌కు 41 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని చవీర విడదీశాడు. అలీ ఔటైనా రథీ దూకుడుగా కొనసాగించాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ హసరంగ, అలసంక ఓవర్లో భారీ షాట్లు కొట్టాడు.
Nizakat Khan’s unbeaten fifty helps Hong Kong post a respectable 149/4 against Sri Lanka in Dubai! 🇭🇰💪
Can they upset Sri Lanka to stay alive in the tournament? 🤔🍿#SLvHK #T20Is #AsiaCup #NizakatKhan #Sportskeeda pic.twitter.com/Ssnz3Nwryf
— Sportskeeda (@Sportskeeda) September 15, 2025
రథీతో కలిసి హాంకాంగ్ ఇన్నింగ్స్‌ను నిజాకత్ ఖాన్(52 నాటౌట్) పరుగెత్తించాడు. ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 61 పరుగులు సాధించి జట్టు స్కోర్ వంద దాటించారు. లంక పాలిట విలన్లా మారి రథీ హాఫ్ సెంచరీకి చేరువైన రథీని చమీర వెనక్కి పంపాడు. అప్పటికీ స్కోర్.. 118-3. అనంతరం నిజాకత్ బౌండరీల మోతతో లంకను వణికించాడు. థీక్షణ వేసిన 20వ ఓవర్లో రెండు రన్స్ తీసి హాఫ్ సెంచరీ సాధించాడు నిజాకత్. దాంతో.. హాంకాంగ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 రన్స్ చేయగలిగింది.