ఖాట్మాండు : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు సంబంధించి రెండు కేసులు నమోదయ్యాయని ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. నవంబర్ 19న కరోనా పాజిటివ్‌గా వచ్చిన 66 విదేశీయుడితో పాటు అతనికి సన్నిహితంగా ఉన్న 71 సంవత్సరాల వ్యక్తికి పాజిటివ్‌గా తేలినట్లు పేర్కొంది. అయితే, వైరస్ సోకిన వ్యక్తి జాతీయతను మాత్రం ఆరోగ్యశాఖ తెలుపలేదు. ఇద్దరిని ఐసోలేషన్‌కు తరలించామని, ఆరోగ్య కార్యకర్తల పర్యక్షణలో చికిత్స పొందుతున్నారని చెప్పింది. ఒమిక్రాన్ పాజిటివ్‌గా గుర్తించిన వ్యక్తులకు 66 మంది వ్యక్తులు కాంటాక్టులుగా గుర్తించి, పరీక్షలు చేశామని.. అందరికీ నెగెటివ్‌గా వచ్చిందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఇటీవల కొత్త వేరియంట్ వెలుగు చూసిన నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం ఇటీవల ఎనిమిది ఆఫ్రికా దేశాలతో పాటు హాంకాంగ్ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించింది.