NPLW vs UAEW : శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ (Women’s Asia Cup)లో నేపాల్ (Nepal) బోణీ కొట్టింది. మెగా టోర్నీ ఆరంభ పోరులో యూఏఈ (UAE) జట్టుపై అద్భుత విజయం సాధించింది. శుక్రవారం దంబుల్లా స్టేడియంలో 6 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఓపెనర్ సంజనా ఖడ్కా (72 నాటౌట్) అర్ధ శతకంతో విరుచుకుపపడడంతో 116 పరుగుల లక్ష్యాన్ని నేపాల్ 16.1 ఓవర్లలోనే కొట్టేసింది.
ఆసియా కప్ ఆరంభ మ్యాచ్‌లో తొలుత ఆడిన యూఏఈ రన్స్ చేసింది. నేపాల్ బౌలర్ల ధాటికి టాపార్డర్ కుప్పకూలిన వేళ కుశి శర్మ(36), కవిశ ఎగొడగె(22)లు జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. అనంతరం ఛేదనకు దిగిన నేపాల్ 39 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ సీతా రనమగర్ (7) స్వల్ప స్కోర్‌కే ఔటైనా మరో ఓపెనర్ సంజనా ఖడ్కా(72) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగింది.
Nepal register their first-ever win in Women’s T20 Asia Cup with victory over UAE 👊
📝: https://t.co/fY0d0u8jmS | 📸: @ACCMedia1 pic.twitter.com/hEKiWcYkOg
— ICC (@ICC) July 19, 2024
యూఏఈ బౌలర్లను ఉతికేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. అయితే.. మరో ఎండ్‌లో వచ్చిన వాళ్లు వచ్చినట్టే పెవిలియన్ చేరగా.. పూజా మహతో(7 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చింది. దాంతో, నేపాల్ 16.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి.. 6 వికెట్ల విజయంతో గ్రూప్ ‘ఏ’ లో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. సూపర్ ఫిఫ్టీతో జట్టును గెలిపించిన సంజన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకుంది.