Microsoft Outage | మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అవుటేజ్.. శంషాబాద్ విమానాశ్రయంపై ప్రభావం..!
Microsoft Outage | ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. దాని ప్రభావం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్‌పై సైతం పడింది. ఎయిర్పోర్ట్ పరిధిలో ఇప్పటి వరకు 35 విమానాలు రద్దయ్యాయి.
Microsoft Outage | ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. దాని ప్రభావం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్‌పై సైతం పడింది. ఎయిర్పోర్ట్ పరిధిలో ఇప్పటి వరకు 35 విమానాలు రద్దయ్యాయి. అదే సమయంలో ఎయిర్‌పోర్టులో డిస్ప్లే బోర్డులు సైతం పని చేయడం లేదు. దాంతో అధికారులు మాన్యువల్ బోర్డులు ఏర్పాటు చేసి.. రద్దయిన విమానాల వివరాలను అందులో ప్రదర్శిస్తున్నారు. మరో వైపు బోర్డింగ్ పాసులను సైతం చేతితో రాసి ఇస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక సమస్య ప్రభావం బోర్డింగ్ పాసుల జారీపై పడిందని.. విమానాలు ఆలస్యం కాకుండా ఉండేందుకు బోర్డింగ్ పాసులను చేతితో రాసి ఇస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు.
అయితే, ప్రయాణికులు ఆయా విమానాలకు సంబంధించిన సమాచారం కోసం ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు. మరో వైపు ఏపీలోని విశాఖపట్నంలోనూ ప్రభావం పడింది. హైదరాబాద్, కోల్‌కతా, ఒడిశా, జయపుర వెళ్లాల్సిన నాలుగు ఇండిగో విమానాలు రద్దయ్యాయినట్లు ఎయిర్‌లైన్ పేర్కొంది. మరోపు ఆన్లైన్ సేవల్లో అంతరాయంపై ఆయా ఎయిర్‌లైన్స్ సంస్థలు స్పందించాయి. సాంకేతిక సమస్యల కారణంగా ఆన్లైన్ బుకింగ్‌తో పాటు చెక్ ఇన్ సేవలను తాత్కాలికంగా నిలిచిపోయాయని ఆయా ఎయిర్‌లైన్స్ సంస్థలు పేర్కొన్నాయి. ప్రయాణికులు వీలైనంత త్వరగా విమానాశ్రయానికి చేరుకొని చెక్ ఇన్ పూర్తి చేసుకోవాలని సూచించాయి. లేకపోతే ప్రయాణానికి ఆటంకం కలిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నాయి. అసౌకర్యానికి చింతిస్తున్నామని.. త్వరలోనే సేవలను పునరుద్ధరించనున్నట్లు తెలిపాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Detection | వ్యక్తుల ముఖాల ఫొటోలతో క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయవచ్చు.. కొత్త ఏఐని అభివృద్ధి చేసిన పరిశోధకులు..
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

