Man’s Revenge Robbery | యజమాని కొడుకు అవమానించడంపై వ్యక్తి ప్రతీకారం.. కోట్లలో డబ్బు దోపిడీ
Man’s Revenge Robbery | ట్రాన్స్పోర్ట్ యజమాని కొడుకు అవమానించడంపై ఒక వ్యక్తి ప్రతీకారం తీర్చుకున్నాడు. 15 మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కంపెనీకి చెందిన కోట్ల నగదును దోచుకున్నాడు. యాజమాని ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: ట్రాన్స్పోర్ట్ యజమాని కొడుకు అవమానించడంపై ఒక వ్యక్తి ప్రతీకారం తీర్చుకున్నాడు. (Man’s Revenge Robbery) 15 మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కంపెనీకి చెందిన కోట్ల నగదును దోచుకున్నాడు. యాజమాని ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. కిషన్ గంజ్ ప్రాంతంలో ఉన్న బికనీర్ అస్సాం ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో క్యాబ్ డ్రైవర్‌గా ఉపేంద్ర పని చేస్తున్నాడు. యజమాని కుమారుడు అతడ్ని అవమానించడంపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు.
కాగా, ఆ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్‌లో నగదు తరలింపు గురించి క్యాబ్ డ్రైవర్ ఉపేంద్రకు తెలుసు. దీంతో ఆ డబ్బును దోచుకోవాలని కుట్ర పన్నాడు. అదే కార్యాలయంలో పని చేసే లారీ డ్రైవర్ కైలాష్ చౌహాన్‌తో కలిసి ప్లాన్ వేశాడు. వారిద్దరూ కలిసి 15 మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు.
జూలై 11న ఆ ట్రాన్స్పోర్ట్ కార్యాలయానికి రూ.3.5 కోట్ల నగదు చేరింది. ఆ రోజు రాత్రి 15 మంది వ్యక్తులు ఆయుధాలతో ఆ ఆఫీస్‌లోకి చొరబడ్డారు. అక్కడున్న వారిని గన్స్‌తో బెదిరించారు. రూ.3.5 కోట్ల నగదు దోచుకుని రెండు కార్లలో పారిపోయారు.
మరోవైపు ట్రాన్స్పోర్ట్ యజమాని ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి ఆ కార్లను గుర్తించారు. 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.15 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా ముగ్గురు వ్యక్తుల కోసం పోలీసులు వెతుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- Employer's Son
- insulted
- MAN
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

