న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం నేరుగా వ్యాక్సిన్లు ఎవరికీ ఇవ్వడం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. రాష్ట్రాల కంటే కేంద్రానికి టీకాలు తక్కువ ధరకే లభిస్తున్నాయన్న ఆరోపణలను కొట్టి పారేశారు. భారత ప్రభుత్వం వద్ద ఉన్న 50శాతం కోటా వ్యాక్సిన్లను రాష్ట్రాల ద్వారానే ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అందువల్ల కేంద్రానికి వ్యాక్సిన్లు చౌకగా లభిస్తున్నాయన్న ఆరోపణలు అసంబద్ధమన్నారు. ఇటీవల సీరం ఇన్స్టిట్యూట్ కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను రాష్ట్రాలకు రూ.400, ప్రైవేటు హాస్పిటల్‌కు రూ.600కు విక్రయించనున్నట్లు ప్రకటించింది. భారత్ బయోటెక్ కొవాగ్జిన్‌ను రాష్ట్రాలకు రూ.600, ప్రైవేటు హాస్పిటల్స్‌కు రూ.1200 సరఫరా చేయనున్నట్లు తెలిపింది.
Shared idealism is the need of the hour !
— Dr Harsh Vardhan (@drharshvardhan) April 25, 2021
Politics around the world’s #LargestVaccineDrive needs to end, for the sake of our citizens.
Here’s clarifying all aspects of upcoming phase 3 of our #Covid19Vaccination drive, putting all speculations to rest.https://t.co/RsdBUrkmMe pic.twitter.com/Mjoku3Bt4Y
ప్రస్తుతం రెండు వ్యాక్సిన్ల కంపెనీలు కేంద్రానికి రూ.150కి సరఫరా చేస్తున్నాయి. టీకా ధరలపై కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా లేవనెత్తిన ఆరు ప్రశ్నలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి 18 ఏళ్లుపైబడిన అన్ని వయసుల వారికి మే ఒకటిన ప్రారంభమయ్యే మూడో దశ టీకాల పంపిణీపై సుదీర్ఘ పోస్ట్‌లో స్పష్టం చేశారు. టీకాలపై అవసరమైన రాజకీయాలు చేస్తున్నారని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్నారు. కేంద్రానికి సంబంధించిన 50శాతం కోటాపై వివరణ ఇచ్చారు. బ్యాలెన్స్ 50 శాతం కోటా కార్పొరేట్, ప్రైవేటు రంగానికి అవసరమైన వనరులను సమకూర్చడానికి, సాధ్యమైనంత త్వరగా టీకాలు వేసేందుకు వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు.
అర్హత ఉన్న వారందరికీ ఉచితంగా టీకాలు వేయడానికి కేంద్రం రాష్ట్రాలకు పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ప్రైవేటు కేంద్రాల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేయగలిగే వ్యక్తులు టీకా పొందే స్వేచ్ఛ ఉందని పేర్కొన్నారు. రాష్ట్రాలు ఉచిత వ్యాక్సిన్ సరఫరాను గ్యారెంటీడ్ ఛానల్ ద్వారా పొందుతున్నాయని, అదే సమయంలో మరో ఛానల్ నుంచి ఆకాంక్ష.. ప్రజల నిబద్ధత ప్రకారం వ్యాక్సిన్లను సేకరించవచ్చని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రాలు ఫిర్యాదు చేయడానికి ‘కారణం లేదు’ అని, ఇప్పుడు నేరుగా వ్యాక్సిన్ల ధరలను కొనుగోలు చేసి చర్చలు జరపవచ్చని తెలిపారు.