నార్నూర్ : అభివృద్ధిలో వెనుకబడ్డ నార్నూర్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడంతో మండలానికి జాతీయస్థాయిలో బంగారు పతకం (Gold Medal ) దక్కింది. నీతి అయోగ్ ( NITI Aayog ) సంపూర్ణ అభియాన్ సమ్మాన్ సమరోహ కార్యక్రమములో భాగంగా ప్రతిభ కనపరిచిన జిల్లా, మండల అధికారులను శనివారం హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గవర్నర్ విష్ణు దేవ్ వర్మ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కు బంగారు పతకం అందజేశారు.
డీఆర్డీవో రవీందర్ రాథోడ్, ఎంపీడీవో రాథోడ్ గంగా సింగ్, ఏపీఎం మైస రమేష్, సీడీపీవో శారద , వ్యవసాయ అధికారి రమేష్‌కు ఉత్తమ సేవ , ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఉత్తమ ప్రతిభ కపరిచిన జిల్లా అధికారులకు చ బ్లాక్ స్థాయి అధికారులకు గవర్నర్ అభినందనలు, తెలిపారు. ఈ కార్యక్రమములో రాష్ట్ర రోడ్డు రవాణా,బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ , సీఎస్ రామకృష్ణ, సంబంధిత శాఖల అధికారులు పేర్కొన్నారు.