‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
నాంపల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సీపీఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి అన్నారు. ఈ మేరకు సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రమౌళి మాట్లాడుతూ...
నాంపల్లి, అక్టోబర్ 12 : నాంపల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సీపీఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి అన్నారు. ఈ మేరకు సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రమౌళి మాట్లాడుతూ.. కరువు మండలంగా ప్రకటించడంతో పాటు, పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవైపు వర్షాలు పడకపోవడంతో ఎంతోమంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆయన అధికారులను కోరారు.
ఎల్ నినో పరిస్థితులు, వాతావరణం మార్పుల నేపథ్యంలో కేంద్రం మద్దతు ధర ప్రకటించిన పంటలన్నీటికి 100% మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆయన కోరారు. ఒకవైపు ఎల్‌నినో ప్రభావం, మరోవైపు విద్యుత్ కొరత రోజుకు 7:00 నుండి 9 గంటల మాత్రమే కరెంటు ఇస్తున్న కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు వాసిపాక ముత్తిలింగం, కొమ్ము లక్ష్మయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

