Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
Jobs | డాక్‌యార్డ్‌లో అప్రెంటిస్ చేయాలనుకునేవారికి కర్వార్ నేవల్ డాక్‌యార్డ్ అవకాశం కల్పించింది. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
Jobs | ఇండియన్ నేవీ (Indian Navi) అప్రెంటిస్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 210 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2027-28/29 సంవత్సరం శిక్షణ ఇవ్వనుంది. దీనిలో కర్వార్ (కర్ణాటక)లోని నేవల్ డాక్‌యార్డ్‌లో 180, డబోలిమ్ (గోవా)లోని నేవల్ ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 30 పోస్టులను నింపనుంది. ఈ మొత్తం పోస్టులు 27 ట్రేడుల్లో ఖాళీగా ఉన్నాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 9లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ట్రేడులు
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మెయింటెనెన్స్ (ICTM), ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, మెరైన్ ఇంజినీర్, మెకానిక్ డీజిల్, మెకానిక్ (Embedded System & PLC), మెకానికల్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్, మెకానిక్ మెకాట్రానిక్స్, మెకానిక్ మోటార్ వెహికల్స్, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ, పెయింటర్స్, ప్లంబర్, షీట్ మెటల్ వర్కర్, వెల్డర్ (Gas & Electric), కార్పెంటర్, షిప్‌రైట్ ఉడ్, టైలర్ తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
నాన్ ఐటీఐ ట్రేడ్స్
క్రేన్ ఆపరేటర్ ఓవర్‌హెడ్ (Steel Industry), ఫోర్జర్ అండ్ హీట్ ట్రేడర్, రిగ్గర్

Posts
అర్హతలు
పదో తరగతి లేదా ఎనిమిదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (NCVT/SCVT) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు నాన్ హజార్డస్ ట్రేడులకు 14, హజార్డస్ ట్రేడులకు 18 ఏండ్లు ఉండాలి. గరిష్ఠ వయసు లేదు.
ఎంపిక
పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రిలిమినరీ మెరిట్ లిస్టు, నాన్ ఐటీఐ వారికి పదో తరగతి, ఎనిమిదో తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. ప్రతి ట్రేడు, కేటగిరీలోని ఒక్కో ఖాళీకి 1:20 నిష్పత్తిలో అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష కర్వార్‌లో 2027, జనవరిలో ఉంటుంది. పరీక్షలో మ్యాథమెటిక్స్ 35, జనరల్ సైన్స్ 35, జనరల్ నాలెడ్జ్ 30 ప్రశ్నల చొప్పున ఇస్తారు. మెడికల్ ఫిట్నెస్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా తుది ఎంపిక చేస్తారు.
ఎంపికైన వారికి నెలకు రూ. 9,600 స్టైపెండ్ ఇస్తారు.
దరఖాస్తు
వెబ్సైట్లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని, దరఖాస్తు ప్రింట్ అవుట్‌ను, అవసరమైన సర్టిఫికెట్లతో ‘ది ఆఫీసర్ ఇన్చార్జ్, డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్, నేవల్ డాక్‌యార్డ్, నేవల్ బేస్, కర్వార్, కర్ణాటక అడ్రస్‌కు స్పీడ్/రిజిస్టర్ పోస్టు ద్వారా పంపాలి.
చివరితేదీ
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 9లోగా అప్లయ్ చేసుకోవాలి. ఇతర వివరాలకు వెబ్సైట్ http://www.iari.res.inలో చూడండి.

Apprentice
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

