Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ శస్త్రచికిత్స అవసరమైనవారు ఆపరేషన్ గురించి ఆందోళన చెందుతుంటారు. ముఖ్యంగా మెడపై మచ్చలు ఏర్పడడం, నొప్పి, కోలుకోవడానికి పట్టే సమయం వంటి అంశాలు వారిని భయపెడుతుంటాయి. అయితే వైద్య సాంకేతికతలో వచ్చిన పురోగతితో థైరాయిడ్ శస్త్రచికిత్సలు మరింత కచ్చితత్వంతో నిర్వహించే అవకాశాలు పెరిగాయి.
Thyroid Problem | థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ శస్త్రచికిత్స అవసరమైనవారు ఆపరేషన్ గురించి ఆందోళన చెందుతుంటారు. ముఖ్యంగా మెడపై మచ్చలు ఏర్పడడం, నొప్పి, కోలుకోవడానికి పట్టే సమయం వంటి అంశాలు వారిని భయపెడుతుంటాయి. అయితే వైద్య సాంకేతికతలో వచ్చిన పురోగతితో థైరాయిడ్ శస్త్రచికిత్సలు మరింత కచ్చితత్వంతో నిర్వహించే అవకాశాలు పెరిగాయి. సంప్రదాయ శస్త్రచికిత్సలో మెడ భాగంలో కోత పెట్టాల్సి ఉంటుంది. రోబోటిక్ థైరాయిడ్ శస్త్రచికిత్సలో మాత్రం ఎంపిక చేసిన రోగులకు చంక లేదా ఛాతీ ప్రాంతం నుంచి కోత పెట్టి థైరాయిడ్ గ్రంథిలో కొంత భాగాన్ని లేదా మొత్తం గ్రంథిని తొలగించవచ్చు. దీంతో మెడపై కనిపించే మచ్చను నివారించే అవకాశం ఉంటుంది. అయితే ఈ విధానంలో రోబోట్ స్వతంత్రంగా శస్త్రచికిత్స చేయదు. వైద్యులే రోబోటిక్ పరికరాలను నియంత్రిస్తూ ఆపరేషన్ నిర్వహిస్తారు.
అందుబాటులో అధునాతన సాంకేతికత..
రోబోటిక్ శస్త్రచికిత్సలో ప్రధాన ప్రయోజనం మచ్చలు కనిపించకుండా ఉండడమే కాదు. ఈ విధానంలో శస్త్రచికిత్స చేసే ప్రాంతాన్ని పెద్దదిగా, త్రిమితీయ రూపంలో స్పష్టంగా చూడగలిగే సాంకేతికత అందుబాటులో ఉంటుంది. అలాగే పరికరాలను మరింత కచ్చితంగా కదిలించేందుకు వీలవుతుంది. థైరాయిడ్ గ్రంథికి సమీపంలో ఉండే స్వరపేటికకు సంబంధించిన నాడులు, పారాథైరాయిడ్ గ్రంథులు వంటి సున్నితమైన భాగాలను గుర్తించి వాటికి నష్టం కలగకుండా జాగ్రత్తగా శస్త్రచికిత్స చేసేందుకు ఈ సాంకేతికత తోడ్పడుతుంది. థైరాయిడ్ ఆపరేషన్ తర్వాత కొందరిలో గొంతు మారడం లేదా స్వరంలో మార్పులు రావడం వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉంది. రోబోటిక్ విధానంలో మెరుగైన దృశ్య స్పష్టత వల్ల నరాలను గుర్తించి కాపాడేందుకు సహాయపడుతుంది. అయితే ఏ శస్త్రచికిత్సలోనూ సమస్యలు వచ్చే అవకాశాన్ని పూర్తిగా తొలగించలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అందరికీ అనుకూలమేనా..
థైరాయిడ్ సమస్య ఉన్న ప్రతి ఒక్కరికీ రోబోటిక్ శస్త్రచికిత్స అనుకూలం కాదు. కొన్ని రకాల థైరాయిడ్ గడ్డలు, ప్రారంభ దశలో ఉన్న ఎంపిక చేసిన క్యాన్సర్లు, నిరపాయకరమైన థైరాయిడ్ గ్రంథి విస్తరణ ఉన్నవారికి వైద్య పరీక్షల అనంతరం ఈ విధానాన్ని పరిశీలించవచ్చు. గడ్డ పరిమాణం, అది ఉన్న ప్రదేశం, వ్యాధి తీవ్రత, రోగి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ఏ శస్త్రచికిత్స అనుకూలమో నిర్ణయిస్తారు. చాలా పెద్ద గాయిటర్, చుట్టుపక్కల కణజాలాలకు వ్యాపించిన ముదిరిన క్యాన్సర్ లేదా సంక్లిష్టమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి సంప్రదాయ శస్త్రచికిత్స మెరుగైన ఎంపిక అవుతుంది. అందువల్ల కొత్త సాంకేతికత అందుబాటులో ఉందని అందరికీ అదే చేయాలని భావించకూడదు. రోగి పరిస్థితికి అనుగుణంగా సరైన విధానాన్ని ఎంచుకోవడమే ముఖ్యం.
కోలుకునే సమయం తక్కువే..
రోబోటిక్ థైరాయిడ్ శస్త్రచికిత్స తర్వాత కోలుకునే సమయం వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి మారుతుంది. ఈ విధానం చేయించుకున్న కొందరు రోగులు కొన్ని గంటల్లోనే నడవగలుగుతారని, ఒకటి లేదా రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మొదటి 48 నుంచి 72 గంటల వరకు నొప్పి నివారణ మందులు అవసరమవుతాయని తమ అనుభవాన్ని వివరిస్తున్నారు. మెడపై కోత లేకపోవడం వల్ల మింగడం, మెడను కదిలించడం కొంత సౌకర్యంగా ఉంటాయి. అయితే వయసు ఒక్కటే ఈ శస్త్రచికిత్సకు అర్హతను నిర్ణయించదు. వ్యాధి స్వభావం, రోగి ఆరోగ్యం, వైద్యుల అనుభవం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. థైరాయిడ్ శస్త్రచికిత్స అవసరమైనవారు అందుబాటులో ఉన్న అన్ని విధానాల ప్రయోజనాలు, పరిమితుల గురించి నిపుణుడితో చర్చించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

