Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Nobel Prize: 2026 సంవత్సరానికి ఆర్థికశాస్త్రంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతిని ప్రకటించారు. రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్పోర్డ్.. ఈ యేటి ఎకనామిక్స్ అవార్డును గెలుచుకున్నారు. స్థూల ఆర్థిక స్థిరీకరణ కోసం అవసరమైన సూక్ష్మ ఆర్థిక వ్యవస్థలను రూపొందించారు.
స్టాక్‌హోమ్: ఆర్థికశాస్త్రంలో 2026 సంవత్సరానికి ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి(Nobel Prize)ని ప్రకటించారు. రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్పోర్డ్.. ఈ యేటి ఎకనామిక్స్ అవార్డును గెలుచుకున్నారు. స్థూల ఆర్థిక స్థిరీకరణ కోసం అవసరమైన సూక్ష్మ ఆర్థిక వ్యవస్థలను రూపొందించినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ తన ప్రకటనలో పేర్కొన్నది. స్వెరిజెస్ రిక్స్‌బ్యాంక్ ప్రైజ్ పేరుతో ఆర్థికశాస్త్రంలో అవార్డు అందజేస్తారు. ఈ శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన స్థూల ఆర్థిక మోడల్స్‌తో.. స్థిరీకరణ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసినట్లు నోబెల్ కమిటీ పేర్కొన్నది. ఆర్థిక స్థిరీకరణ కోసం వీళ్లు రూపొందించిన మోడళ్లతోనే ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు, ప్రభుత్వాలు తమ ఆర్ధిక విధానాలను అమలు చేస్తున్నట్లు నోబెల్ కమిటీ చెప్పింది. ఆర్థిక ఒడిదిడుకులను ఎదుర్కొనే రీతిలో ఆ మోడళ్లు ఉన్నట్లు కమిటీ పేర్కొన్నది. ఇంధనం సంక్షోభం, గృహ వినియోగాల్లో జరిగే ఆకస్మిక మార్పులను ఎదుర్కొనే రీతిలో స్థూల, సూక్ష్మ విధానాలను రూపొందించారు.
స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్విడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ అవార్డును ప్రకటించింది. వ్యాపారంలో ఆవిష్కరణలపై స్టడీ చేసిన ముగ్గురు ఆర్థికశాస్త్రవేత్తలకు గత ఏడాది నోబెల్ అవార్డు దక్కింది. కొత్త ఉత్పత్తులు, ఆవిష్కరణలతో ఎలా ఆర్థికవృద్ధి, మానవ సంక్షేమం జరుగుతుందో ఆ శాస్త్రవేత్తలు నిరూపించారు.ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతిని.. బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ సైన్సెస్ అంటారు. టెక్నికల్‌గా ఎకనామిక్స్ ప్రైజ్‌ను నోబెల్ ప్రైజ్‌గా గుర్తించారు. కానీ డిసెంబర్ 10వ తేదీన అన్ని ప్రైజ్‌లతో పాటు ఎకనామిక్స్ అవార్డును కూడా అందజేస్తారు.
BREAKING NEWS
The Royal Swedish Academy of Sciences has decided to award the 2026 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel to Robert E. Hall and Michael Woodford “for microeconomic foundations of macroeconomic stabilisation.”#NobelPrize https://t.co/2i7ktB1Q2b
— The Nobel Prize (@NobelPrize) October 12, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

