హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఏపీ సీఎం నారా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఓబుళాపురం మైనింగ్ కేసు విచారణలో భాగంగా గురువారం విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు నాగం హాజరయ్యారు. ఎట్టకేలకు ఉమ్మడి రాష్ట్రంలోని ఈ కేసులను కొట్టివేసింది. చాలాకాలం తర్వాత కలవడంతో నాగంను చంద్రబాబు ఆత్మీయంగా పలకరించారు.