CITU | దుండిగల్, జూలై 9 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, పెట్టుబడి దారుల ప్రయోజనం కోసం కార్మిక వర్గాన్ని బలిచ్చేందుకు తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ దుండిగల్ మండల కన్వీనర్ బొడిగె లింగస్వామి డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం గండి మైసమ్మ -దుండిగల్ మండలం సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గండిమైసమ్మ చౌరస్తాలో ర్యాలీ, రాస్తారోకో అనంతరం లింగస్వామి మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను కట్టు బానిసల్లాగా తయారు చేయడం కోసం కార్మిక చట్టాలను మారుస్తూ.. పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిది గంటల పని విధానాన్ని లేకుండా చేసి జీవో 282ను తీసుకొచ్చి 10 గంటల డ్యూటీ చేయాలని కార్మికులను ఇబ్బందుల గురి చేసే విధంగా పెట్టుబడిదారుల లాభాల కోసం కార్మికులను బానిసలుగా చేయడం కోసం ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
అదేవిధంగా వివిధ రంగాలలో పనిచేసే కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేల రూపాయలు ఇవ్వాలని ,రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని ,కార్మికులపై పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని అసంఘటిత రంగ కార్మికుల్ని ఆదుకోవాలని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అన్నారు. లేనిపక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎస్ .సత్యనారాయణ, వీరమల్లు, సత్యం, నరసింహ, ఎల్లయ్య, సూరి, పెంటేష్, శ్రీను, రాధ,అనిత, హంస, లలిత, పద్మ, స్వరూప, పద్మావతి, నవనీత తదితరులు పాల్గొన్నారు.
Nizampet | రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి : సోమలింగారెడ్డి
Dangerous Roads | నిత్యం ప్రమాదపు అంచున.. రోడ్ల మరమ్మతుల కోసం ప్రజల ఎదురుచూపు
Garbage | ఎక్కడ చూసినా వ్యర్థాలే.. వ్యవసాయ మార్కెట్ యార్డు కంపుమయం