Road Accidents | జహీరాబాద్, నవంబర్ 19 : జహీరాబాద్ ప్రాంతంలో శీతాకాలం తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు పేరుకు పోవడం వల్ల రహదారులపై ముందు ఉన్న వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని.. ఈ సమయంలో ప్రమాదాలు జరగకుండా అన్ని వాహనదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జహీరాబాద్ రూరల్ ఎస్ఐ కాశీనాథ్ సూచించారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ ఎం కాశీనాథ్ చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.
టూవీలర్ వాహనదారులు- తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
1. స్పష్టమైన గాజు ఉన్న హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి
2. హై-బీమ్ వాడకండి, లో-బీమ్ లైట్లు మాత్రమే ఉపయోగించాలి
3. వేగం తగ్గించి ముందున్న వాహనానికి సురక్షిత దూరం పాటించాలి
4. రిఫ్లెక్టివ్ జాకెట్లు, స్టిక్కర్లు వాడుకోవాలి
5. సడన్ బ్రేకులు వేయకుండా జాగ్రత్త పడాలి.. రోడ్డు తడిగాఉంటే స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది
6. టర్నింగ్ అయ్యే ముందు ఇండికేటర్ ఇవ్వాలి
7. రాత్రి/తెల్లవారుజామున ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సమయాల్లో పొగమంచు తీవ్రత ఎక్కువ
8. గ్లౌవ్స్ తప్పనిసరిగా ధరించాలి చేతులు చల్లబడితే వాహన నియంత్రణ తగ్గుతుంది
ఫోర్ వీలర్ డ్రైవర్లు – జాగ్రత్తలు :
1. ఫాగ్ ల్యాంప్స్ లేదా లో-బీమ్ లైట్లు మాత్రమే వాడాలి
2. వేగం తగ్గించి నెమ్మదిగా, జాగ్రత్తగా నడపాలి
3. ముందున్న వాహనానికి సాధారణ దూరం కంటే 3–4 రెట్లు ఎక్కువ దూరం ఉంచాలి
4. డిఫాగర్ ఉపయోగించాలి / విండోలను కొద్దిగా ఓపెన్ చేసి ఫాగింగ్ నివారించాలి
5. హాజర్డ్ లైట్లు విజిబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు వాడాలి
6. పొగమంచు లేదా కర్వ్ ప్రాంతాల్లో ఓవర్టేక్ చేయవద్దు
7. లైన్ మార్కింగ్‌లు, రోడ్ రిఫ్లెక్టర్లను గమనిస్తూ నడపాలి
8. వైపర్స్, లైట్లు, బ్రేకులు సరిగా పనిచేస్తున్నాయో లేదో ముందుగానే తనిఖీ చేసుకోవాలి
9. సడన్ బ్రేకులు లేదా మలుపులు వద్ద వేగాన్ని నివారించాలి
సాధారణ సూచనలు..
*ముందుగానే ప్రయాణం ప్రారంభించండి; తొందరపడొద్దు
*హెడ్లైట్లు శుభ్రంగా ఉంచండి
*రోడ్డు సూచనలు, ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించండి
* విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటే, సురక్షిత ప్రదేశంలో ఆగి వేచి ఉండండి
* ప్రజల భద్రతే మా లక్ష్యం
శీతాకాలంలో రోడ్లపై వాహనదారులు జాగ్రత్తలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని జహీరాబాద్ రూరల్ ఎస్ఐ కాశీనాథ్ విజ్ఞప్తి చేశారు.
Irregularities | వే బ్రిడ్జిలో అవకతవకలు.. రైస్‌మిల్లును మూసేయాలని రైతుల డిమాండ్
Shaligouraram : మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే మందుల సామేల్
AI Course | యువత కోసం ఫ్రీ AI కోర్స్.. పూర్తిచేస్తే కేంద్ర ప్రభుత్వ సర్టిఫికెట్