WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ ముందే ముంబై ఇండియన్స్ (Mumbai Indians) హెడ్‌కోచ్‌ను నియమించింది. మూడు సీజన్లుగా జట్టుతో కొనసాగుతున్న చార్లొట్టే ఎడ్వర్డ్స్ (Charlotte Edwards) స్థానంలో ఆస్ట్రేలియా దిగ్గజం లీసా కీగ్ట్లే (Lisa Keightley)ను తీసుకుంది. ఎడ్వర్డ్స్ ఏప్రిల్‌లో ఇంగ్లండ్ జాతీయ జట్టుకు కోచ్‌గా వెళ్లింది. దాంతో, ఆమె స్థానాన్ని అనుభవజ్ఞురాలైన కీగ్ట్లేతో భర్తీ చేయాలని ఫ్రాంచైజీ నిర్ణయించింది. ముంబైకి కోచ్‌గా ఎంపికవ్వడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. డబ్ల్యూపీఎల్‌లో రెండు ట్రోఫీలతో తమకు తిరుగులేదని చాటిన ఫ్రాంచైజీ విజయయాత్రలో భాగం కావాలని అనుకుంటున్నట్టు ఆమె తెలిపారు.
‘ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్‌గా నియమితుల్వడం చాలా గర్వంగా ఉంది. డబ్ల్యూపీఎల్‌లో రెండు ట్రోఫీలతో చెరగని ముద్ర వేసిన జట్టు ముంబై. ఫ్రాంచైజీ సంస్కృతి, విధివిధానాలు నాకు చాలా నచ్చాయి. ప్రతిభావంతులైన ముంబై టీమ్‌తో పనిచేసేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. ముంబై విజయాల్లో పాలుపంచుకొని.. మైదానంలో క్రికెటర్లలో స్ఫూర్తి రగిలించాలని భావిస్తున్నా’ అని కీగ్ట్లే వెల్లడించింది. ఆసీస్ వెటరన్ ప్లేయర్ అయిన కీగ్ట్లే 1997, 2005లో వరల్డ్ కప్ గెలుపొందిన జట్టులో సభ్యురాలు.
ऐका ऐका! Our new #WPL Head Coach Lisa has a message for you 💌🗣️#AaliRe #MumbaiIndians pic.twitter.com/UJba05ROLJ
— Mumbai Indians (@mipaltan) September 25, 2025
కీగ్ట్లేకు పొట్టి ఫార్మాట్లో కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఈమధ్యే ఆమె దిశానిర్దేశనంలో నార్తర్న్ సూపర్ఛార్జర్స్ (Northern Superchargers) జట్టు ‘ది హండ్రెడ్ లీగ్’లో ఛాంపియన్‌గా నిలిచింది. అలానే మహిళల బిగ్‌బాష్ లీగ్‌లోనూ సిడ్నీ థండర్స్ జట్టుకు కీగెట్లే సేవలందించారు. అందుకే ఆమెనే తమ జట్టుకు సరైన కోచ్ అని ముంబై యాజమాన్యం భావించింది. మరి.. మూడో టైటిల్ గెలవాలనుకుంటున్న హర్మన్‌ప్రీత్ కౌర్ సేనకు కీగ్ట్లే ఏమేరకు తోడ్పడుతుందో చూడాలి. డబ్ల్యూపీఎల్‌లో హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ వరుసగా రెండు సీజన్లలో విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.