ముంబై : వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు టీమిండియా(Team India) జట్టును ఇవాళ బీసీసీఐ ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ 15 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ప్రకటించారు. కెప్టెన్సీ బాధ్యతలు శుభమన్ గిల్‌కు దక్కాయి. ఇక రవీంద్ర జడేజాకు ఈసారి వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. జట్టులో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ద్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, ఎన్ జగదీశన్ ఉన్నారు.
వెస్టిండీస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి టెస్టు అక్టోబర్ 2వ తేదీన ప్రారంభంకానున్నది. గాయం కారణంగా రిషబ్ పంత్‌ను ఎంపిక చేయలేదు. ఇక బ్యాటర్ కరుణ్ నాయర్‌ను కూడా పక్కనపెట్టేశారు. అహ్మదాబాద్, ఢిల్లీలో మ్యాచ్‌లు జరగనున్నాయి. రిషబ్‌కు ఫ్రాక్చర్ కావడంతో.. అతని స్థానంలో జడేజాకు వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. అయితే సౌతాఫ్రికాతో జరిగే హోం సిరీస్‌కు రిషబ్ పంత్ అందుబాటులో ఉంటారని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు.
కరుణ్ నాయర్ నుంచి చాలా ఆశించామని, ఒక్క ఇన్నింగ్స్ ఆడడం కాదు అని, అయితే పడిక్కల్ మంచి ఫామ్‌లో ఉన్నాడని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరికీ ఎక్కువ ఛాన్సులు ఇవ్వలేమని అగార్కర్ అన్నాడు.
🚨 Presenting #TeamIndia‘s squad for the West Indies Test series 🔽#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/S4D5mDGJNN
— BCCI (@BCCI) September 25, 2025