Khaidi Movie | మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ’మూవీ ఎంతంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరు కెరీర్లోనే ఖైదీకి ముందు ఖైదీకి తరువాత అన్నట్లుగా రికార్డులు నెలకొల్పింది. అయితే సినిమా విడుదలైన రోజులను తాజాగా గుర్తు చేసుకున్నాడు స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్. చిరంజీవికి చిన్నప్పటి నుంచే అభిమాని అయిన పూరి ఖైధీ సినిమా విడుదల రోజున జరిగిన సంఘటన గురించి సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
‘‘పాత డైరీ దొరికింది. ‘ఖైదీ’ సినిమా రిలీజ్ రోజున, ఒక అభిమాని తన స్వహస్తాలతో చిరంజీవి గారి చిత్రం గీసి థియేటర్ దగ్గర ఫొటో కార్డ్ డిస్ప్లేలో పెట్టిన 60/40 ఫొటో దొరికింది. ఆ అభిమాని పేరు పూరి జగన్నాథ్’’ అంటూ అప్పట్లో ఆయన గీసిన ఫొటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. బాస్‌తో సినిమాను ప్లాన్ చేయడంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు సన్నాఫ్ ఖైదీ అంటూ రామ్ చరణ్‌తో ఒక సినిమా ప్లాన్ చేయవచ్చు కదా అంటూ పూరి పోస్ట్ కింద కామెంట్లు పెడుతున్నారు. సినిమాల విషయానికి వస్తే.. పూరి ప్రస్తుతం విజయ్ సేతుపతితో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో టబు కీలక పాత్రలో నటించబోతుంది.
పాత డైరీ దొరికింది. ఖైదీ సినిమా రిలీజ్ రోజున, ఒక అభిమాని తన స్వహస్తాలతో చిరంజీవి గారి చిత్రం గీసి థియేటర్ దగ్గర photo card display లో పెట్టిన 60/40 ఫోటో దొరికింది. ఆ అభిమాని పేరు
పూరి జగన్నాథ్. pic.twitter.com/ZHiEysD9BF— Puri Connects (@PuriConnects) September 25, 2025