కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ ( Cement Company) కార్మికులకు బోనస్ ( Bonus ) విషయంలో గుర్తింపు సంఘం, దేవాపూర్ సిమెంట్ కంపెనీ యాజమాన్యంతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి.
కంపెనీ యాజమాన్యం, గుర్తింపు సంఘం యూనియన్ అధ్యక్షులు కొక్కిరాల సత్యపాల్ రావు ( Satyapal Rao) ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో ఈ ఏడాది పర్మినెంట్, లోడింగ్ కార్మికులకు గతంలో ఉన్న రూ.35,500కు ఈ ఏడాది మొదటి ఏడాది రూ.4000 కలిపి రూ.39,500, వచ్చే ఏడాది మరో రూ. 2000 కలిపి రూ.41,500 ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించింది. ఇది రెండేళ్ల పాటు కొనసాగుతుందని వివరించారు.
కాంట్రాక్ట్ కార్మికులకు గత ఏడాది రూ.16,800 ఇవ్వగా రూ.1000 పెంచి రూ.17,800 చెల్లించేందుకు అంగీకారం కుదిరిందని కొక్కిరాల సత్యపాల్ రావు వెల్లడించఆరు. త్వరంలోనే కార్మికుల ఎకౌంట్లో బోనస్ జమ కానుందని తెలిపారు. గతం కంటే పోలిస్తే ఈ ఏడాది మెరుగైన బోనస్ సాధించినట్లు యూనియన్ నాయకులు తెలిపారు. ఈ చర్చల్లో కంపెనీ హెచ్ఆర్ హెడ్ కులకర్ణి, యూనియన్ జనరల్ సెక్రెటరీ భీమిని మహేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేరుగు శంకర్, కాల్వ సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.