దేశానికే ఆదర్శం ముఖరా (కే) గ్రామం : మంత్రి ఎర్రబెల్లి
Minister Errabelli | దేశానికే ఆదర్శంగా ముఖరా (కే) గ్రామం నిలిచిందని, ఇవ్వాళ దేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఆ గ్రామ మోడల్ ను అనుసరిస్తున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
హైదరాబాద్ : దేశానికే ఆదర్శంగా ముఖరా (కే) గ్రామం నిలిచిందని, ఇవ్వాళ దేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఆ గ్రామ మోడల్ ను అనుసరిస్తున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆ గ్రామాన్ని అంతగా తీర్చిదిద్ది రాష్ట్రానికి గొప్ప పేరు తెచ్చిన గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, కార్యదర్శిని మంత్రి అభినందించారు.
ఇటీవల పూణేలో జరిగిన పంచాయతీ రాజ్ సమ్మేళనం లో పాల్గొని అత్యున్నత ప్రతిభ కనబరచిన గ్రామంగా మరోసారి గుర్తింపు పొందిన సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్ గాడ్గె మినాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాష్‌ను మంత్రిని మంగళవారం హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో కలిశారు.
ఈ సందర్భంగా పూణేలో పొందిన అవార్డు ను మంత్రి కి చూపించారు. వారిని అభినందించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ..పూణేలో జరిగిన జాతీయ స్థాయి పంచాయతీ రాజ్ సమ్మేళనంలో పాల్గొన్న దేశంలోని 5 గ్రామాల్లో ముఖ రా కే గ్రామం అత్యున్నత స్థానం పొందిందని తెలిపారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అనేక పథకాలు గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నాయని తెలిపారు. ఇదే పనితీరును కొనసాగించాలని వారికి మంత్రి సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

