Dumping yard | జగద్గిరిగుట్ట, జూన్ 4 : జగద్గిరిగుట్ట సమీపంలోని డంపింగ్ యార్డు ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతోంది. గాజులరామారం, కొత్త పుల్లాపూర్ మున్సిపల్ సర్కిల్ పరిధిలోని చెత్తను కలెక్టింగ్ వాహనాల ద్వారా జగద్గిరిగుట్టకు చేరుస్తారు. డంపింగ్ యార్డ్‌లోని కంప్రెస్సింగ్ యంత్రాల సాయంతో వాటిని కంటైనర్లలో జవహర్ నగర్‌కు తరలిస్తారు.
ఐదేళ్ల క్రితం ఏర్పాటైన డంపింగ్ యార్డ్ ప్రధాన రహదారికి ఆనుకునే ఉంటుంది. దీంతో చెత్త తరలించే ఆటోలు భారీ సంఖ్యలో లోపలికి బయటికి రాకపోకలు సాగిస్తుంటాయి. షాపూర్ నగర్ నుంచి జగద్గిరిగుట్ట మీదుగా కూకట్పల్లి ప్రాంతానికి వెళ్లే ప్రయాణికుల వాహనాలు ఈ మార్గంలోనే వెళ్తుంటాయి. ఉదయం సాయంత్రం వేళల్లో విపరీతమైన రద్దీ నెలకొంటున్నది. డంపింగ్ యార్డ్ యాజమాన్యం రోడ్డుపై సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడం ఇబ్బందులు పెంచుతోంది.
ఈ నేపథ్యంలో మరోవైపు మార్గం ఏర్పాటు చేసి చెత్త తరలించే ఆటోలు రోడ్డుపై నిలపకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. రోడ్డు సమీపంలోనే చెత్త పారబోతను అరికట్టాల్సి ఉంది. మున్సిపల్ సిబ్బంది డంపింగ్ యార్డ్ నిర్వాహకులు నియంత్రణ చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
ACB Summons: 2 వేల కోట్ల స్కామ్‌లో సిసోడియా, సత్యేంద్రకు ఏసీబీ సమన్లు
MLC Kavitha | కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే నోటీసులు.. రేవంత్ సర్కారుపై కవిత ఫైర్..
Karimnagar | తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.. నగదు, బియ్యం బస్తాలు ఎత్తుకెళ్లిన దొంగలు