సత్తుపల్లి, నవంబర్ 9: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీతను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ తాతా మధు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని వెంగళరావు నగర్, కల్యాణ్నగర్లలో బీఆర్ఎస్ ఖమ్మం శ్రేణులతో కలిసి ఆదివారం విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు బీఆర్ఎస్ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకులు కూడా పాల్గొన్నారు.