Greener | తక్కువ పచ్చదనంతోనే మంచి మూడ్.. ఇంట్లో ఎక్కువ మొక్కలుంటే ఒత్తిడి
ఇంట్లో తక్కువ మొక్కలుంటే మన మనః స్థితి(మూడ్) బాగుంటుందని, ఒక గదిలో చాలా మొక్కలుంటే అది మనల్ని ఒత్తిడికి గురి చేస్తుందని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ తాజా అధ్యయనం వెల్లడించింది. మనుషులు ఇండ్ల లోపల ఎంత మేరకు పచ్చదనం, కలప సామాగ్రిని చూడగలరనే విషయంలో కొత్త మార్గాన్ని అధ్యయన బృందం అభివృద్ధి చేసింది.
- స్టాన్ఫోర్డ్ తాజా అధ్యయనం వెల్లడి
వాషింగ్టన్: ఇంట్లో తక్కువ మొక్కలుంటే మన మనః స్థితి(Mood) బాగుంటుందని, ఒక గదిలో చాలా మొక్కలుంటే అది మనల్ని ఒత్తిడికి గురి చేస్తుందని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ తాజా అధ్యయనం వెల్లడించింది. మనుషులు ఇండ్ల లోపల ఎంత మేరకు పచ్చదనం (Greenery), కలప సామాగ్రిని చూడగలరనే విషయంలో కొత్త మార్గాన్ని అధ్యయన బృందం అభివృద్ధి చేసింది. ‘ఇంటి లోపలి ప్రకృతి’లోని వివిధ స్థాయిలు మనుషుల సంపూర్ణ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశాన్ని పరిశీలించడానికి వారు ఈ పద్ధతిని ఉపయోగించారు. కొన్ని మొక్కలు, కిటికీ నుంచి చెట్లను చూడటం ఈ అధ్యయనంలో పాల్గొన్నవారికి విశ్రాంతి కలిగించాయి. అయితే మొక్కల సంఖ్యను పెంచిన కొద్దీ వారు ఒత్తిడికి గురవడం మొదలు పెట్టారు.
ఒక గదిలో 60 శాతం స్థలాన్ని మొక్కలు, కలపతో నింపేసినప్పుడు ఆ గదిలోని వారి ఒత్తిడి స్థాయిలు అత్యంత ఎక్కువ స్థాయికి చేరుకున్నాయని అధ్యయన రచయిత ఎవా బియాన్చి తెలిపారు. ఈ అంశంపై చాలా పరిశోధనలు జరిగాయని.. అయితే విభిన్న పద్ధతుల వల్ల ఫలితాలను ప్రత్యక్ష పోలికలు చేయలేమని మరో రచయిత సారా బల్లింగ్టన్ అన్నారు. ఈ అంతరాలను తొలగించడానికి ‘నేచర్ వ్యూ పొటెన్షియల్’ అనే సాఫ్ట్వేర్ను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది. గదిలో ఉండే సహజమైన అంశాలు మానసిక ఆరోగ్యానికి లాభదాయకమని ఈ అధ్యయనం తెలియజేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

