BV Raghavulu |హైదరాబాద్ : మధిర నియోజకవర్గంలో సీపీఎం నాయకుడు సామినేని రామారావు హత్య జరిగి తొమ్మిది రోజులైనా దోషులను పట్టుకోలేదు.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం అని సీపీఎం జాతీయ నేత బీవీ రాఘవులు నిప్పులు చెరిగారు.
దొంగలను గంటల్లోనే పట్టుకున్నామని హోంమంత్రి, పోలీసు శాఖ వారు చెబుతుంటారు. దోపిడీ చేసిన వారిని రోజులోనే పట్టుకున్నామని పోలీసులు చెప్పినట్లు పేపర్లలో వార్తలు వస్తుంటాయి. మరి సామినేని రామారావు హత్య జరిగి 9 రోజులైనా ఏం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది..? భట్టి విక్రమార్క ఏం చేస్తున్నారు. హోం మినిస్టర్‌గా ఉన్న సీఎం ఏం చేస్తున్నారు..? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ హత్య రాజకీయంగా జరిగింది. కాంగ్రెస్ వారే ఈ హత్యకు పాల్పడ్డారని చెబుతున్నాం. కాదని చెప్పుకోవాల్సిన బాధ్యత, రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీది. దీనిపై విచారణ జరిపి దోషులను శిక్షించే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీవీ రాఘవులు హెచ్చరించారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం
మధిర నియోజకవర్గంలో సీపీఎం నాయకుడు సామినేని రామారావు హత్య జరిగి తొమ్మిది రోజులైనా దోషులను పట్టుకోలేదు
ఈ హత్య చేసింది కాంగ్రెస్ నాయకులే అని మేము చెప్తున్నాం
దీనిపై విచారణ జరిపి దోషులను శిక్షించే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలి పెట్టం – సీపీఎం… https://t.co/aNAYUT4iwt pic.twitter.com/goC42DPqKw
— Telugu Scribe (@TeluguScribe) November 9, 2025