నర్సాపూర్, ఫిబ్రవరి6: నర్సాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కండ్ల ముందు కనపడుతుందని, మీ చేసిన అభివృద్ధిని చూపించాలని ఎమ్మెల్యే సునితాలక్మారెడ్డి బీజేపీ, కాంగ్రేస్ పార్టీ నాయకులకు సవాలు విసిరారు. శుక్రవారం నర్సాపూర్ మున్సిపాలిటీలోని 10,11,12 వార్డులలో ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థులు కండెల(బుల్లెట్) రాజు, తొంట వినయ్‌కుమార్, సమీనా బేగంల తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను చూపుతూ కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ నర్సాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సహకారంతో ఇంటింటికి మిషన్‌భగీరథ నల్లాలు, ఆర్టీసీ బస్ డిపో, రూ.12 కోట్లతో వాటర్ ట్యాంకులు, చెరువు పునరుద్ధరణ, వెజ్ ఆండ్ నాన్‌వెజ్ మార్కెట్, మున్సిపల్ భవనం, స్మశాన వాటిక, ఈద్గాల అభివృద్ధి, సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్, స్మశాన వాటికకు 5 ఎకరాల స్థలం, 4లైన్ రోడ్డు, డివైడర్లు, సెక్రిగేషన్ షెడ్ తదితర అభివృద్ధి పనులను చేపట్టామని గుర్తుచేశారు.
గడిచిన రెండెండ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నర్సాపూర్ మున్సిపాలిటీకి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఒక్క నయా పైసా కూడా మున్సిపల్ అభివృద్ధికి తీసుకురాలేకపోయిందని దుయ్యబట్టారు. బీజేపీ అధికారంలో ఉండి నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలను పెంచిందని మండిపడ్డారు. అభివృద్ధిని చేసిన బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సంతోష్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ అశోక్ గౌడ్, జడ్సీ కో-ఆప్షన్ మాజీ సభ్యులు మన్సూర్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, బీఆర్ఎస్ నాయకులు నాగరాజుగౌడ్, శ్రవణ్ కుమార్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.