చిన్నశంకరంపేట, మార్చి 15 : గ్యాస్, పెట్రోలు, నిత్యవసర వస్తువుల ధరలను పెంచి కేంద్ర ప్రభుత్వం పేద ప్ర జల నడ్డి విరిచిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం చిన్నశంకరంపేటలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, భూమి పట్టాలు, సీఎం రీలీఫ్ ఫండ్ చెక్కులతోపాటు దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎందుకు అమలు చేయడం లేదని? ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. ఆడబిడ్డల తల్లిదండ్రులకు కల్యాణలక్ష్మి పథకం వరమన్నారు. కల్యాణలక్ష్మి పథకంతో బాల్య వివాహాలు తగ్గాయన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పట్లోరి మాధవి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, తహసీల్దార్ మహేందర్‌గౌడ్, ఎంపీటీసీ యా దగిరి, సర్పంచ్‌లు జ్యోతీయాదగిరియాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సుధాకర్‌నాయక్, లాల్యానాయక్, నరేశ్, శ్రీనివాస్, ప్రభాకర్, రమేశ్, నరేశ్, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.
మెదక్ మున్సిపాలిటీ, మార్చి 15 : ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించే ‘మీ కోసం’ కార్యక్ర మాన్ని అనివార్య కారణాలతో రద్దు చేస్తున్నట్లు బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గంగాధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని మెదక్ నియోజక వర్గంలోని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.