నేరేడ్మెట్, మే 5: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి చెక్కులతోపాటు తులం బంగారం కూడా అందించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మల్కాజిగిరిలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలను ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించిందని మండిపడ్డారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల ప్రయోజనాలు పారదర్శకంగా అందేలా అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ సీతారాం, డీటీ, మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు బద్దం పరశురాంరెడ్డి, జీకే హన్మంతరావు, జేఏసీ వెంకన్న, చిందం శ్రీనివాస్, ప్రభాకర్‌గౌడ్, శ్రీనివాస్ గౌడ్, శివగౌడ్, సాయిగౌడ్, ఇబ్రహీం, కేబుల్ రమేష్, ఫరీద్, చందు, సురేష్, నర్సింగ్ రావు, నవాబ్ తదితరులు పాల్గొన్నారు.