హైదరాబాద్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ): తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్రం వివక్ష చూపిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్య దర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మా ట్లాడారు. గతంలో పాలమూరు ఎత్తిపోతలకు వనరులు కేటాయిస్తా మని బీజేపీ తన మ్యానిఫెస్టోలో పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు కృషి చేయాలని కూనంనేని డిమాండ్ చేశారు. దీంతో పాటు తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం విషయంలో కూడా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.