గోల్నాక, జూలై 4: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ దర్శించుకున్నారు. శక్రవారం ఉదయం వీవీఐపీ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకి టీటీడీ ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలతో సత్కరించి ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట ప్రముఖ న్యాయవాది ముకుంద్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు చంద్రమోహన్, భూపతి లక్ష్మణ్, భీష్మదేవ్, మేడి ప్రసాద్ తదితరులు ఉన్నారు.