పాలమూరును అన్నపూర్ణ జిల్లాగా మారుస్తాం : మంత్రి హరీష్ రావు

హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీష్ రావు సమాధానం ఇచ్చారు. పాలమూరు జిల్లాను ఆకుపచ్చ, అన్నపూర్ణ జిల్లాగా మార్చాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఉద్ఘాటించారు. గత ప్రభుత్వాలు వదిలేసిన పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కోయిల్‌సాగర్, కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడులను పూర్తి చేసి సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతలను యుద్ధప్రతిపాదికన పూర్తి చేసి సస్యశ్యామలంగా మారుస్తామన్నారు.
ఇప్పటికే సీఎం కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులపై రివ్యూ చేశారని తెలిపారు. చిట్టచివరి ఆయకట్టుకు నీరు అందించేలా పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులకు రీడిజైన్ చేస్తున్నారు. రిజర్వాయర్ల సామర్థ్యం పెంచుకుంటున్నామని తెలిపారు. గుడిపల్లి రిజర్వాయర్ వద్ద లిఫ్ట్ ద్వారా వచ్చే నీరు.. 3250 క్యూసెక్కులు కాగా.. ఇందులో 1250 క్యూసెక్కుల నీటిని అచ్చంపేట కెనాల్‌కు తరలిస్తున్నామని చెప్పారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తున్నాం. కానీ కొందరు పనులను అడ్డుకుంటూ కోర్టుల్లో కేసులు వేశారు. ఇప్పుడిప్పుడే కోర్టు కేసులను పరిష్కరించాం. త్వరితగతిన పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు.
నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో 40,064 ఎకరాలు, మహబూబ్‌నగర్‌లో 15,073, కొడంగల్‌లో 1, 17,135, నారాయణపేట 63,382, మక్తల్ 66,963, కల్వకుర్తి 96,398, అచ్చంపేట 2,675, షాద్‌నగర్ నియోజకవర్గంలో 79,996 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

