ఉలన్బాతర్(మంగోలియా): ఏషియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల మెరుగైన ప్రదర్శన కొనసాగుతున్నది. పోటీల రెండో రోజైన మంగళవారం జరిగిన మహిళల 60కిలోల బౌట్లో ప్రియ 5-0 తేడాతో రిమ్మా వోలెసెంకో(కజకిస్థాన్)పై అద్భుత విజయం సాధించింది.
ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన ప్రియ… పవర్ఫుల్ పంచ్‌లతో విరుచుకుపడుతూనే మరోవైపు ప్రత్యర్థికి దీటుగా బదులిస్తూ ముందుకు సాగింది. మరోవైపు పురుషుల 55కిలోల బౌట్లో జాదుమణిసింగ్ 2-3 తేడాతో రిమా యమగుచి(జపాన్)పై పోరాడి ఓటమిపాలయ్యాడు. ఈ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ బాక్సర్‌గా కొనసాగుతున్న యమగుచికి జాదుమణి దీటైన పోటీనిచ్చాడు.