హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): హైడ్రాకు రూ.72 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం ప్రభుత్వం జీవో-721ను జారీ చేసింది. హైడ్రా సంస్థ నిర్వహణ, వ్యవస్థాగత అవసరాలకు ఈ నిధులను మంజూరు చేస్తూ పరిపాలనా ముందస్తు అనుమతి ఇచ్చింది.
2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాల్లో మొదట కేటాయించిన రూ.50 కోట్లకు అదనంగా మరో రూ.22 కోట్లను పునః సమీక్షించి మొత్తం రూ.72 కోట్లు విడుదల చేయడానికి అనుమతి ఇచ్చింది.