పదేండ్లలోపు చిన్నారులకు బరువు తగ్గించే ఔషధాలు ఇవ్వవద్దని, అవి మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయనేందుకు ఆధారాలు లేవని తెలియజేసింది. అయితే పిల్లల కోసమే లైసెన్సులు పొందిన ఔషధాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. అయినప్పటికీ ఔషధాలు, సర్జరీలపై ఆధారపడకుండా ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లతో ఊబకాయాన్ని అదుపులో ఉంచుకోవడం ఉత్తమమని డబ్ల్యూహెచ్వో సూచించింది. ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల మంది చిన్నారులు ఊబకాయంతో బాధపడుతున్నట్లు అంచనా.