పలు ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ట్రావెల్ ఆపరేటర్లపై చర్యలు తీసుకుంటామని ఆర్టీఏ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే ట్రావెల్స్‌కు ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. చార్జీలు, పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించే ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. ప్రమాదాల దృష్ట్యా ట్రావెల్స్ నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఫైర్ సేఫ్టీ నుంచి పరిమిత వేగం వరకు అన్ని నిబంధనలు పాటించాలని చెప్పారు. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేయాలని సూచించారు. ఫిట్నెస్లేకుండా రోడ్డెక్కితే బస్సులు సీజ్ చేస్తామని, ప్రయాణికులకు కలిగే నష్టం ట్రావెల్స్ భరించాల్సి ఉంటుందని హెచ్చరించారు.