హుజూరాబాద్: “అబ్ధుల్ బాయ్ ఎట్లున్నవ్..మీ హోటల్లో చాయ్ బాగుంటుందని విన్నా..”
అని మంత్రి హరీశ్‌రావు అనగానే హోటల్ యజమాని ఖుషీ అయ్యిండు.. మంత్రి తన హోటల్‌కు వచ్చిండని సాదర స్వాగతం పలికిండు..హరీశ్‌రావుకు కమ్మటి చాయ్ అందించిండు. అబ్దుల్బాయ్ ఆప్కా చాయ్ అచ్చా హై.. అని హరీశ్‌రావు అనంగనే మురిసిపోయిండు..
వివరాల్లోకెళితే.. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్‌రావు ఊరూరా తిరుగుతున్నారు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా వివరిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం హుజూరాబాద్‌లో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. తిరిగి వెళ్తుండగా చాయ్ తాగేందుకు సిటీ ప్యాలెస్ వద్ద ఆగారు. నేరుగా హోటల్లోకి వెళ్లి యజమానిని పేరుతో పలకరించే సరికి అతడు ఆనందంలో మునిగితేలాడు. మంత్రి హరీశ్‌రావు చాయ్ తాగుతూ హోటల్ యజమానితో కాసేపు ఆత్మీయంగా మాట్లాడారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ హోటల్లో చాయ్ బాగుంటుందని తెలిసి వచ్చానన్నారు. అనంతరం టీ డబ్బులు ఇచ్చి వెళ్తుండగా సార్ సెల్ఫీ అని యజయాని అడగ్గానే.. కలిసి ఫొటో దిగారు.. హోటల్ బయట యువకులతోనూ కలిసి హరీశ్‌రావు సెల్ఫీలు దిగారు.