బెంగళూరు: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కర్ణాటక మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సూసైడ్ బాంబు ఇస్తే, తాను పాకిస్థాన్‌కు వెళ్లి, యుద్ధం చేస్తానని చెప్పారు. ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియోలో, “అవసరమైతే నేను సూసైడ్ బాంబ్‌తో పాకిస్థాన్‌కు వెళ్తాను. నేను జోక్ చేయడం లేదు, జోష్‌తో మాట్లాడటం లేదు. దేశానికి నా అవసరం ఉంటే, నరేంద్ర మోదీ, అమిత్ షాలను నాకొక సూసైడ్ బాంబ్ ఇవ్వమనండి. అల్లా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. దానిని నేను కట్టుకుని, పాకిస్థాన్‌కు వెళ్తాను” అన్నారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, “మనం ఇండియన్స్, హిందుస్థానీలం. పాకిస్థాన్‌తో మనకు సంబంధం లేదు. పాకిస్థాన్‌పై యుద్ధానికి సిద్ధం. యుద్ధం చేయడానికి నన్ను పంపిస్తే, ఓ మంత్రిగా నేను సిద్ధం. నేను వెళ్తాను, దేశం కోసం పోరాడుతాను” అని చెప్పారు.