తాండూర్ : మధ్యాహ్న భోజన ( Mid-day Meal ) పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని సీఐటీయూ( CITU ) జిల్లా సహాయ కార్యదర్శి దాగాం రాజారాం, మధ్యాహ్న భోజన కార్మికులు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ప్రైవేటు అప్పచెప్పే ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం తాండూర్ ఎమ్మార్సీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి సీసీవో ప్రశాంత్ కు వినతిపత్రం అందజేశారు.
టిఫిన్స్ కూడా మధ్యాహ్న భోజనం కార్మికులే విద్యార్థులకు వండి పెడుతున్నారని, టిఫిన్ మెటీరియల్ అంతా పాఠశాలకు సరఫరా చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రతినెలా రూ.10,000 వేతనం చెల్లిస్తామన్న హామీ ప్రకారం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి మల్లక్క, గడ్డం హనుమక్క, జైనేని లక్ష్మి, కోట రాధా, రామగిరి వరలక్ష్మి, దుర్గం లక్ష్మి, తాండూర్ నాగమ్మ, దాసరి లక్ష్మి, జాడి సుశీల, దుర్గం నాగలక్ష్మి, ఊరడి సరిత, శ్రీనివాస్ పాల్గొన్నారు.