రుద్రంపూర్, మే 14 : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కుక్కలు, కోతుల నివారణకు తక్షణమే చర్యలు తీసుకుని వాటి నుండి ప్రజలను రక్షించాలని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ మున్సిపల్ అధికారులను కోరారు. గురువారం డివిజన్ పరిధిలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కుక్కలు, కోతులు పెద్దలు, చిన్న పిల్లలపై దాడులు చేస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం సరికాదన్నారు. మున్సిపల్ సిబ్బందిపై కూడా రెండు సందర్భాల్లో కోతులు, కుక్కలు దాడి చేసినా అధికారుల్లో చలనం లేకపోవడం శోచనీయమన్నారు.
నిన్న పాల్వంచలో జరిగిన శిశువు తలను కుక్కలు తినడం దురదృష్టకరమైన సంఘటనను చుసిన తర్వాత కూడా కార్పొరేషన్ అధికారులు మేలుకుని కుక్కలు, కోతుల నివారణ పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోతులు, కుక్కల నివారణ పట్ల అధికారులు చర్యలు తీసుకోనట్లయితే ప్రజలను సమీకరించి ఉద్యమం చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నామని ఆమె హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు బెల్లం బేబీ, రావిశెట్టి పద్మ, రామ్ రాకేష్, వాసం బాబు, మార్తమ్మ, గుంజ వెంకన్న పాల్గొన్నారు.