కుక్కలు, కోతుల నివారణకు చర్యలు తీసుకోవాలి : మునిగడప పద్మ
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కుక్కలు, కోతుల నివారణకు తక్షణమే చర్యలు తీసుకుని వాటి నుండి ప్రజలను రక్షించాలని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ మున్సిపల్ అధికారులను కోరారు. గురువారం డివిజన్ పరిధిలో...
రుద్రంపూర్, మే 14 : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కుక్కలు, కోతుల నివారణకు తక్షణమే చర్యలు తీసుకుని వాటి నుండి ప్రజలను రక్షించాలని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ మున్సిపల్ అధికారులను కోరారు. గురువారం డివిజన్ పరిధిలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కుక్కలు, కోతులు పెద్దలు, చిన్న పిల్లలపై దాడులు చేస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం సరికాదన్నారు. మున్సిపల్ సిబ్బందిపై కూడా రెండు సందర్భాల్లో కోతులు, కుక్కలు దాడి చేసినా అధికారుల్లో చలనం లేకపోవడం శోచనీయమన్నారు.
నిన్న పాల్వంచలో జరిగిన శిశువు తలను కుక్కలు తినడం దురదృష్టకరమైన సంఘటనను చుసిన తర్వాత కూడా కార్పొరేషన్ అధికారులు మేలుకుని కుక్కలు, కోతుల నివారణ పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోతులు, కుక్కల నివారణ పట్ల అధికారులు చర్యలు తీసుకోనట్లయితే ప్రజలను సమీకరించి ఉద్యమం చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నామని ఆమె హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు బెల్లం బేబీ, రావిశెట్టి పద్మ, రామ్ రాకేష్, వాసం బాబు, మార్తమ్మ, గుంజ వెంకన్న పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

