అమరావతి : మెడలో ముచ్చటగా మూడు ముళ్లు పడ్డ గంటల వ్యవధిలోనే ఓ నవ వధువు ( Bride Died ) మృతి చెందిన విషాద ఘటన ఏపీలోని విశాఖపట్నం ( Visakapatnam ) జిల్లాలో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి అగనంపూడి ప్రాంతానికి చెందిన నరసింగరావుకు వాడచీపురుపల్లికి చెందిన రామేశ్వరితో పెళ్లి జరిగింది.
గురువారం మధ్యాహ్నం వరుడి ఇంటికి బయలు దేరిన నూతన దంపతుల కారు అదుపుతప్పి అగనంపూడిలో స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవ వధువు రామేశ్వరి మృతి చెందగా వరుడు నరసింగరావుతో పాటు మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.