UAE | ఆ వార్తల్లో నిజం లేదు.. నెతన్యాహు మా దేశంలో పర్యటించలేదు : యూఏఈ
UAE | పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతల వేళ ఇజ్రాయెల్ ప్రధాని (Israel Prime Minister) బెంజామిన్ నెతన్యాహు (Benjamin Nethanyahu) బుధవారం రహస్యంగా యూఏఈలో పర్యటించినట్లు వచ్చిన వార్తలు చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ వార్తలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తోసిపుచ్చింది. బెంజామిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) తమ దేశంలో పర్యటించలేదని, ఆ వార్తల్లో నిజం లేదని తెలిపింది.
UAE : పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతల వేళ ఇజ్రాయెల్ ప్రధాని (Israel Prime Minister) బెంజామిన్ నెతన్యాహు (Benjamin Nethanyahu) బుధవారం రహస్యంగా యూఏఈలో పర్యటించినట్లు వచ్చిన వార్తలు చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ వార్తలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తోసిపుచ్చింది. బెంజామిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) తమ దేశంలో పర్యటించలేదని, ఆ వార్తల్లో నిజం లేదని తెలిపింది. నెతన్యాహు కాదు కదా.. కనీసం ఇజ్రాయెల్ సైనిక బృందం కూడా తమ దేశంలో పర్యటించలేదని స్పష్టంచేసింది. ఇజ్రాయెల్ (Israel) తో తమ సంబంధాలన్నీ బహిరంగమేనని, అబ్రహం ఒప్పందాల చట్టానికి లోబడే ఇరుదేశాల మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపింది.
ఇందులో ఎలాంటి రహస్యాలు, నిగూఢ వ్యవహారాలకు తావులేదని యూఏఈ పేర్కొన్నది. అందువల్ల యూఏఈ (UAE) అధికారులు ప్రకటిస్తే తప్ప రహస్య పర్యటనలకు సంబంధించి వచ్చే వార్తలన్నీ నిరాధారమైనవేనని ఎమిరేట్స్ ప్రభుత్వం అధికారిక మీడియాలో వెల్లడించింది. అయితే నెతన్యాహు యూఏఈ పర్యటన గురించి ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. పర్యటన సందర్భంగా నెతన్యాహు, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కలిసి విస్తృత చర్చల్లో పాల్గొన్నారని తెలిపింది. ఈ పర్యటన యూఏఈ, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలను పెను మలుపు తిప్పిందని స్పష్టం చేసింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం నెతన్యాహు తమ దేశంలో పర్యటించలేదని చెబుతోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

