Massive Fire | గోవా నైట్‌క్లబ్ విషాదం మరవకముందే ఒడిశా (Odisha)లో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించింది. రాజధాని భువనేశ్వర్ (Bhubaneswar)లోని ఓ బార్లో శుక్రవారం ఉదయం మంటలు చెలరేగాయి. కాసేపటికే మంటల తీవ్రత పెరిగి.. ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
నగరంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న సత్యవిహార్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతుండటంతో అప్రమత్తమైన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు సమీప భవనాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా వెల్లడికాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఆదివారం తెల్లవారుజామున గోవాలోని అర్పోరా నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనలో 25 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటన మరకవముందే ఇప్పుడు ఒడిశా బార్లో ప్రమాదం ఆందోళన కలిగిస్తోంది.
Also Read..
HIV Cases | బీహార్‌లో హెచ్ఐవీ కలకలం.. ఒక్క జిల్లాలోనే 7,400 మందికి పాజిటివ్.. 400 మంది చిన్నారులే
IndiGo | ఇండిగో సంక్షోభం.. నలుగురు అధికారులపై డీజీసీఏ వేటు
PM Modi | తలైవాకు ప్రధాని మోదీ స్పెషల్ బర్త్‌డే విషెస్